ఏ ఒక్క ఉద్యోగీ ఆందోళన చెందొద్దు.. సమస్యలను పరిష్కరించుకుందాం

by S Gopi |
ఏ ఒక్క ఉద్యోగీ ఆందోళన చెందొద్దు.. సమస్యలను పరిష్కరించుకుందాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో టీఎన్జీఓస్ నేతలు శుక్రవారం ఆయనను కలిశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, భార్యాభర్తల బదిలీలు చేపట్టాలని, డీఏ మంజూరు చేయాలని, గచ్చిబౌలిలోని భాగ్యనగర్ ఎన్జీఓస్ హౌజింగ్ సొసైటీ ప్లాట్లు అప్పగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందొద్దని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన కేటీఆర్ కు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్, కేంద్ర అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed