ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్రారంభం.. ఆన్‌లైన్‌ కొనుగోలుకు వీలు

by Mahesh |
ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్రారంభం.. ఆన్‌లైన్‌ కొనుగోలుకు వీలు
X

దిశ, అంబర్‌పేట్: ప్రభుత్వ కార్యాలయాల ద్వారా వస్తు సేవల ఆన్‌లైన్‌ కొనుగోలుకు వీలుకల్పించే విధంగా ప్రభుత్వ ఇ-విక్రయ వేదిక (జీఇఎం) హైదరాబాద్‌కు చెందిన విక్రేతలతో నగరంలోని పత్రికా సమాచార సంస్థ ప్రాంగణంలో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సేవల విభాగం డైరెక్టర్‌ విక్రమజీత్ వర్మ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలోని ఇతర ఉన్నత, స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థల ద్వారా వస్తుసేవల కొనుగోలుకు ఉద్దేశించిన ప్రభుత్వ వ్యవస్థనే అన్నారు. వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఆగస్టు 9న ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.

దాదాపు 51,23,042 మంది విక్రేతలు సుమారు 50 లక్షల ఉత్పత్తులు, సేవలు అందజేస్తున్నట్లు చెప్పారు. జీఇఎం' ద్వారా విక్రేతలు తమ ఉత్పత్తులు, సేవలు నమోదు చేసుకుని, విక్రయించడానికి వీలుగా కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ పెండ్యాల తెలిపారు. వాణిజ్య సరుకుల విలువ ప్రస్తుతం రూ.1,06,647 కోట్లుగా ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారు సంస్థలకు కార్యశాలలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యక్తిగత పారిశ్రామికవేత్తలతో పాటు 'ఎంఎస్‌ఎంఈ'లు కూడా వీటిలో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 మంది విక్రేతలు ఈ 'విక్రేతల కార్యశాల' లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు 'జీఇఎం' వ్యాపార సమన్వయకర్త రవివర్మ వేదిక ప్రత్యేకతల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.

Next Story

Most Viewed