ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ తొలి పూజ.. టైం ఇదే..!

by Disha Web Desk 7 |
ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ తొలి పూజ.. టైం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు పండుగల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగా వినాయక చవితి. ఈ పండుగా వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. గల్లీ గల్లీలో గణేశుడిని ప్రతిష్టిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మహా గణపతి విగ్రహం.. ఈసారి 63 అడుగుల ఎత్తులో శ్రీదశమహా విద్యాగణపతిగా భక్తలకు దర్శనమిస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయక చవితి సంబురాలు అంబరాన్ని అంటాయి. భక్తులు భారీ ఎత్తున ఖైరతాబాద్ చేరుకుంటున్నారు. ఇక శ్రీ దశమహా విద్యాగణపతి తొలిపూజ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. ఈ పూజకు తెలంగాణ గవర్నర్ తమిళి సైతో పాటు హర్యాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తోపాటు స్థానిక అధికారులు పాల్గొననున్నారు.


Next Story

Most Viewed