Telangana News: గూగుల్‌తో రాష్ట్రప్రభుత్వం ఎం.ఓ.యూ

by samatah |   ( Updated:2022-04-28 13:41:25.0  )
Telangana News: గూగుల్‌తో రాష్ట్రప్రభుత్వం  ఎం.ఓ.యూ
X

Telangana News

దిశ, మియాపూర్ : సుస్థిర ఆర్థికాభివృద్ధి , సమ్మిళిత సామాజిక అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేవలను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ) కుదుర్చుకున్నది. గురువారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చారు.ఈ ఒప్పందం‌తో తెలంగాణ యువతకు గూగుల్(Google) కెరీర్ సర్టిఫికేట్‌, స్కాలర్‌షిప్‌లు లభించనున్నది. డిజిటల్, వ్యాపారం , మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నారు. డిజిటల్ బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ, బలోపేతం చేయడానికి గూగుల్ ప్రభుత్వంతో సహకరిస్తుందన్నారు. ప్రజా రవాణా, వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ(తెలంగాణ ) ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గూగుల్ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్ గుప్తా, కంట్రీ హెడ్ & వైస్ ప్రెసిడెంట్, గూగుల్ ఇండియా కే‌టీ‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, జయేష్ రంజన్‌, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed