- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
‘సీఆర్ఎంపీ’కి గ్రీన్ సిగ్నల్.. 13 అంశాలకు ఆమోదం
by srinivas |

X
దిశ, సిటీబ్యూరో: పాతవి, కొత్తవి కలిపి కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ)లో భాగంగా రూ.3,825 కోట్లతో 1141.25 కిలోమీటర్ల రోడ్లను 2025-30 (ఐదేండ్ల పాటు) నిర్వహించేందకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల ప్రతిపాదనలకు గురువారం మేయర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు. సమావేశంలో 13 అంశాలను ఆమోదించారు. వీటిలో 10 ప్రధాన అంశాలు, మూడు టేబుల్ అంశాలు ఉన్నాయి.
స్టాండింగ్ కమిటీ ఆమోదించిన 13 అంశాలు..
- సీఆర్ఎంపీ ఫేజ్-1 కింద చేపట్టిన పనులకు కొనసాగింపుగా సీఆర్ఎంపీ ఫేజ్-2 కింద 744.22 కిలోమీటర్ల రోడ్డు నిర్వహణ కోసం జోన్ వైస్ ప్యాకేజీలతో 2025 నుంచి 2030 కాలానికి రూ.2,491 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పనులు చేపట్టడానికి బడ్జెట్ కేటాయింపు కోరడం, సీఆర్ఎంపీ ఫేజ్-2 కింద 2025-30 కాలానికి రూ.3825 కోట్ల అంచనా వ్యయంతో 1142.54 కిలోమీటర్ల కొత్త రోడ్ల అభివృద్ధి కోసం టెండర్ ప్రాసెస్ చేయడానికి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ఆమోదం.
- గుల్మొహర్ పార్కు జంక్షన్ నుంచి తారానగర్ మీదుగా బీహెచ్ఈఎల్ జంక్షన్ వరకు, రైల్వే క్రాసింగ్ లింగంపల్లి నుంచి 1100 మీటర్ల పొడవు రోడ్డు విద్యానికేతన్ స్కూల్ నుంచి గల్మొహర్ జంక్షన్ వరకు 30 మీటర్లు, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు 227 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
- ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేషనల్ హైవే 44 పైనా 6 లేన్ల గ్రేడ్ సపరేటర్‌కు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేయుటకు కమిషనర్ యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం కార్పొరేషన్‌కు సిఫార్సుకు కమిటీ ఆమోదం.
- కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ పాయింట్స్ వద్ద ఫైబర్, సిమెంట్ కుండిలతో పూల మొక్కలతో గ్రీనరీ కోసం సీఎస్ఆర్ పద్దతిన ఏర్పాటు చేసి నిర్వహించుటకు మెస్సర్స్ క్రియేటివ్ థాట్స్ మీడియా హైదరాబాద్ వారికి మూడేళ్ల పాటు నిర్వహించుటకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేయుటకు ఆమోదం.
- చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో 2025 సంవత్సరానికి గాను 6 డీ-సిల్టింగ్ పనుల కోసం రూ.22.31కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనుల్లో చార్మినార్ జోన్‌లో రూ.12.33 కోట్లతో 3 పనులు, ఖైరతాబాద్ జోన్‌లో రూ.3.79 కోట్లు, కూకట్‌పల్లి జోన్‌లో రూ.3.15 కోట్లు, శేరిలింగంపల్లి జోన్‌లో రూ.3.05కోట్ల వ్యయంతో చేపట్టేందుకు పరిపాలన అనుమతితో పాటు టెండర్ పిలువడానికి ఆలస్య నివారణకు రాటిఫికేషన్ కమిటీ ఆమోదం.
- చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో 2025 సంవత్సరానికి గాను మూడు డీ-సిల్టింగ్ పనుల కోసం రూ.6.98 కోట్లలో చార్మినార్ జోన్‌లో రూ.2.30 కోట్లు, ఖైరతాబాద్ జోన్‌లో రూ.2.64 కోట్లు, సికింద్రాబాద్ జోన్‌లో రూ.2.03 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలన అనుమతితో పాటు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ వేయుటకు ఆమోదం.
- లాలాపేట్ ఫ్లైఓవర్ నుంచి మౌలాలి ఫ్లైఓవర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ కోసం మంజూరైన రూ.3 కోట్లకు అదనంగా అయిన రూ.1.30 కోట్లకు రివైజ్డ్ పరిపాలన అనుమతికి ఆమోదం.
- హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్‌ఫర్మేటివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) కింద ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు రూ.7,032 కోట్ల వ్యయంతో చేపట్టే పనుల కోసం ప్రభుత్వ ఆమోదం కోసం సిఫార్సుకు ఆమోదం. ప్యాకేజీ 1 ద్వారా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, ముగ్దా జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి రూ.580 కోట్ల వ్యయంతో చేపట్టడానికి ప్రతిపాదించడమైనది. రోడ్ నెం.45 జంక్షన్ ఫిల్మింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాల కోసం రూ.510 కోట్లతో ప్రతిపాదించబడింది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రూ.5,942 కోట్లతో 23 పనులు చేపట్టడానికి ప్రతిపాదించబడింది. మంజూరైన 4,305 కోట్లను అదిగమించి సవరణ వ్యయాన్ని మంజూరు చేయడమైనది. హెచ్-సిటీ ప్రాజెక్టులో జీహెచ్ఎంసీకి అవసరమైన వ్యయాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు చేయబడుతుంది.
- నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ సదన్ మీదుగా ఒవైసీ వరకు సమగ్రాభివృద్ధి కోసం రూ.620 కోట్ల అంచనా వ్యయానికి రాటిఫికేషన్‌కు ఆమోదం.
- నారాయణగూడలో ఓల్డ్ మున్సిపల్ మార్కెట్ స్థలంలో నిర్మించిన మోడల్ మార్కెట్ భవన నిర్మాణంలో చేసిన మార్పులకు కమిటీ ఆమోదం.
- టేబుల్ ఐటమ్స్..
- ఎంజే మార్కెట్ నుంచి భూలక్ష్మి దేవాలయం (ముస్లిం జంగ్ బ్రిడ్జి) వయా మాలకుంట బేగం బజార్ రోడ్డు వరకు 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయుటకు ఆమోదం.
- ఎస్ఆర్డీపీ కింద గచ్చిబౌలి జంక్షన్ వద్ద రెండో లెవల్ వద్ద కొండాపూర్ వైపు, ఓఆర్ఆర్ వైపు 6 లేన్ల టూవే ఫ్లైఓవర్ నిర్మాణం, శిల్పా లేఅవుట్ నుంచి గ్యాస్ కంపెనీ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వరకు 120 అడుగుల వెడల్పు రహదారి ఏర్పాటుకు ఎలివేటెడ్ స్ట్రక్చర్ పద్ధతిలో ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ కింద మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రాజెక్ట్ అమలుకు రీవైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్‌కు ఆమోదం.
- రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ప్రతిపాదించిన గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద అప్రోచ్ రోడ్ నుంచి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వరకు 9 మీటర్లు, 12 మీటర్లు, 18 మీటర్ల విస్తరణతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం.
Advertisement
Next Story