- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన..

దిశ, శేరిలింగంపల్లి : గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన రవాణా సౌకర్యం కోసం హెచ్ సిటీ ద్వారా పలు ప్రాంతాల్లో ప్రతిపాదించి చేపట్టనున్న ఫ్లైఓవర్ పనులను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తీ ఆయా శాఖల అధికారులతో కలిసి ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను చేపట్టబోయే ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నివారణకు హెచ్ సిటి ద్వారా మొదటి ప్రాధాన్యత ఇచ్చి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
టెండర్ పక్రియ పూర్తయ్యేవరకు భూసేకరణ పూర్తి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తీ సూచించారు. నానా నగర్, ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ, డీఎల్ఎఫ్, విప్రో సర్కిల్, సరోజినీ దేవి హాస్పిటల్ నుండి ఖైరతాబాద్ వరకు వయా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, చింతల్ బస్తీ మీదుగా రోడ్డు వెడల్పు ఫీసిబిలిటీ, ప్రతిపాదించిన జంక్షన్ల వద్ద టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధికారులతో కలిసి కమిషనర్ ఇలంబర్తి పరిశీలించారు. ఆయన వెంట పాల్గొన్న జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ప్రాజెక్టు సీఈ భాస్కర్ రెడ్డి, ప్రాజెక్టు ఈఈ హరీష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.