- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ ఆర్టిస్ట్ లతో ఓజీ గంజాయి దందా..
అంతర్జాతీయ గంజాయి మాఫియా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ తో పాటు మరికొంత మంది మహిళలను గంజాయి సరఫరా లోకి దించారు.

దిశ, సిటీక్రైం : అంతర్జాతీయ గంజాయి మాఫియా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ తో పాటు మరికొంత మంది మహిళలను గంజాయి సరఫరా లోకి దించారు. ట్రిప్పుకు రూ.20 వేల ను ఎర వేసి కోట్లాది రూపాయాల ఓజీ(ఓషియన్ గంజాయి)గంజాయిని దేశంలోకి తెప్పిస్తున్నారు. ఇటీవల ఈగల్ పోలీసులు అంతర్జాతీయ ఓజీ గంజాయి నెట్ వర్క్ గుట్టు బయటపెట్టారు. విచారణలో అందిన సమాచారంతో దర్యాప్తు చేయడంతో మహిళలతో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. తాజాగా ఈగల్ కు అందిన ముందస్తు సమాచారంతో లుక్ ఔట్ నోటీసులను జారీ చేసి హైదరాబాద్ సనత్ నగర్ ప్రాంతానికి చెందిన జూనియర్ సూరి కళ ను ఈ నెల 6వ తేదీన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, ఎన్సీబీ అధికారులతో కలిసి ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విచారణలో కేరళకు చెందిన అలెక్స్ అలియాస్ నఫ్షీద్ పరిచయంతో అతను బ్యాంకాక్ ట్రిప్పుకు వెళ్ళి, అక్కడ వారు ఇచ్చే బ్యాగును తీసుకువచ్చి ఇస్తే రూ.20 వేలు ఇస్తానని ఆశపుట్టించాడు. ఈ విధంగా సూరీకళను అక్రమ ఓజీ గంజాయి సరఫరాలోకి దించాడని తేలింది. సూరీకళ ఇప్పటి వరకు మూడు సార్లు బ్యాంకాక్ వెళ్లి అక్కడ అలెక్స్ అనుచరులు ఇచ్చిన బ్యాగులను తీసుకువచ్చి నగరంలో రాజు బిస్వాస్ అందించినట్లు తెలిపింది. మరో ఇద్దరు గౌరీ, గంగా భవానీలతో కూడా ఓజీ గంజాయిని బ్యాంకాక్ నుంచి తీసుకువచ్చారని విచారణలో తెలిపింది. గంగాభవానీ, గౌరీలు కొన్ని రోజుల కిందట చెన్నైయ్, బెంగళూరు ఎయిర్ పోర్టులో ఎన్సీబి, కస్టమ్స్ అధికారులు చిక్కారని తెలిసింది. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇతర వస్తువులు మాత్రమే తీసుకురావాలని చెప్పి వీరితో ఓజీ గంజాయిని సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అలెక్స్ , రాజు బిస్వాస్ ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.






