- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
గణేష్ లడ్డూలకు భలే డిమాండ్

దిశ, చార్మినార్ : వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలకు భలే డిమాండ్ పెరిగింది. వినాయక చవితి రోజున ఇండ్లలో, గణేష్ మండపాలలో ప్రతిష్ఠించిన లడ్డూను నైవేద్యంగా నివేదిస్తారు. దీంతో గణేష్ లడ్డులకు భలే గిరాకీ పెరిగింది. అంతేగాకుండా గణేష్ మండపాలలో పెట్టిన లడ్డును నిమజ్జనం రోజున వేలం పాట వేస్తుండడంతో లడ్డులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వేలం పాటలో వేసే భారీ లడ్డులను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. దీంతో నగరంతో పాటు పాతబస్తీలోని స్వీటు షాపులు కళకళలాడుతాయి. పండుగకు 15 రోజుల ముందు నుంచే వినాయక విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా తయారు చేసే భారీలడ్డులకు ముందస్తు ఆర్డర్లు ఇస్తుంటారు.
లడ్డులకు గిరాకీ పెరగడంతో పాటు లడ్డూల రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పాతబస్తీ లాల్‌దర్వాజాలోని బాలానంద స్వీట్ షాపులో 100 కిలోల లడ్డును తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తిరుపతి నర్సింగ్‌రావు, తిరుపతి శివకుమార్‌లు తెలిపారు. తమ వద్ద రూ.10 లడ్డు నుంచి రూ.40వేల లడ్డు వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. కిలో రూ.400 చొప్పున లడ్డును విక్రయిస్తున్నట్లు చెప్పారు. గత ఆరేళ్ళుగా శివగంగానగర్‌లో పార్థీలతో పాటు, ఇబ్రహీంపట్నం నుంచి జైహింద్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసే వినాయ విగ్రహాలకు 100 కిలోల లడ్డును తమ వద్ద అర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటారని పేర్కొన్నారు.