- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉస్మానియా ఆస్పత్రిలో ఫ్రీడం ఫర్ రన్..

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగదనుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో కలిసి ఆయన ఫ్రీడం రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ.. ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి నాగేందర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా ఆస్పత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎం డాక్టర్ సాయి శోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంఓలు డాక్టర్ రఫీ సుష్మ, కవిత, అనురాధ, మాధవి తదితరులు పాల్గొన్నారు.