- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

దిశ,మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలో గల ప్రగతి ఎనక్లేవ్‌లో నీలిమ హైట్స్ అపార్ట్మెంట్ నందు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బిపి, షుగర్, పల్స్, కంటి, దంత, పరీక్షలతో పాటు ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఫయాజ్ ( జనరల్ ఫిజిషన్ ), రవితేజ రుద్రురాజు ( ఆర్తో), రామ్స్( నేత్ర వైద్యులు ), చిత్రాంజలి ( డెంటల్ ), వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ..
మారిన జీవనశైలితోపాటు పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానం, నడకలాంటి వాటికి కనీసం 40 నిమిషాలు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, అమర్, రామచందర్ రావు, రాజు ముద్దసాని, కె వి రావు, రమేష్ అజయ్ రెడ్డి, మల్లారెడ్డి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, ఉమా చంద్రశేఖర్ మరియు హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.