రైల్వేలో ఫుడ్ ఆన్ ట్రాక్ సేవలు

by Disha Web Desk 15 |
రైల్వేలో ఫుడ్ ఆన్ ట్రాక్ సేవలు
X

దిశ, మెట్టుగూడ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ -కేటరింగ్ యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ వ్యాపార సేవల కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323 ప్రారంభించినట్టు ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ పేర్కొన్నారు. కాగా ఈ కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలుపర్చడానికి ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో www.ecatering.irctc.co.in లింక్‌ను క్లిక్ చేయడం వల్ల సేవలు పొందవచ్చు. దీనికి యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టేషన్లలో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు. మరొకటి వాట్సాప్ నంబర్ ద్వారా AI పవర్ చాట్‌ నుండి వినియోగదారులకు ఈ కేటరింగ్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా సందేహాలను నివృత్తి తో పాటు పరస్పర సంభాషణలు చేసేందుకు వీలుకల్పిస్తుంది. ఈ సేవలు మొదటగా ఎంపిక చేసిన రైళ్లు మరియు ప్రయాణికులకు మాత్రమే కల్పించారు. ప్రయాణికుల అభిప్రాయాలు మరియు సూచనల ఆధారంగా ఇతర రైల్వే లలో కూడా ఈ సేవలను ప్రారంభిస్తుంది. వెబ్‌సైట్, యాప్ ప్రారంభించిన రోజునే సుమారు 50,000 భోజనాలను అందించడం గమనార్హం.


Next Story