- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ బ్రిడ్జిపై చెరువును తలపించిన వరద.. 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని స్టీల్ బ్రిడ్జిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు విద్యానగర్ నుంచి ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. స్టీల్ బ్రిడ్జి మీద భారీగా నీరు నిల్వడంతో వాహనాలు ఎటూ కదల్లేక ఆగిపోయాయి. అంతేకాకుండా అదే నీటిలో పలు వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వడంతో వాహనదారుల అవస్థలు అన్నిఇన్నీ కావు. ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు వాహనదారులే నీటి తరలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2 నుంచి 3 గంటల పాటు వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోయాయి. అత్యున్నత ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని గత పాలకులు చెబుతున్నా.. కనీసం బ్రిడ్జిపై నిలిచిన నీళ్లు వెళ్లే మార్గం లేకుండా పోయిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిధిలోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.






