- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండోర్ స్టేడియంలో ఫ్లెక్సీల రగడ

దిశ, ఎల్బీనగర్: దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ల సమస్య పరిష్కారం కోసం జీవో విడుదల చేసేందుకు ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీవోను విడుదల చేయనున్నారు. అయితే "మన నగరం" పేరుతో జీహెచ్ఎంసీ నిధులతో అధికారిక కార్యక్రమం పెట్టి టీఆర్ఎస్ ప్లెక్సీలు పెట్టారని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రండి- కలిసిరండి.. ప్రశ్నిద్దాం - పరిష్కరించుకుందాం. మన నగరం కార్యక్రమానికి స్వాగతం అంటూ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్లెక్సీ ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్లెక్సీలో ఏ ఒక్క దానిలో కూడా "మన నగరం" అనే ప్లెక్సీ పెట్టలేదని, ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏంటని ప్రశ్నించారు. దీంతో పోలీసులు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కార్పొరేటర్ పెట్టిన ప్లెక్సీలను పోలీసులు తొలగించారు.