- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హాస్టల్ కొనసాగించాలని రోడ్డుపై బైఠాయించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ మొదటి సంవత్సరం విద్యార్థినులు హాస్టల్ మూసివేయకూడదంటూ లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధినులు మాట్లాడుతూ.. వివిధ పోటీపరీక్షల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో హాస్టళ్లు ముసివేయడం ఏంటని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాస్టళ్లను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెమిస్టర్ పరీక్షలు అయిన వెంటనే మెస్‌లు మూసివేసి, హాస్టల్స్ మాత్రం తెరిచి ఉండేవన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం హాస్టల్ మెస్‌తో పాటు హాస్టళ్లను కూడా మూసి వేసి సామాన్లు సర్దుకొని వెళ్ళమనడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని హాస్టల్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. వర్సీటీ అధికారులు వచ్చి నచ్చచెప్పినా.. వినకుండా వర్సిటీ వీసీ వచ్చే వరకు విరమించేది లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు.