ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం

by Disha Web Desk 15 |
ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం
X

దిశ, మియాపూర్ : నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దారి వెంట వెళ్తున్న వాహనదారులు గుర్తించి డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో వెంటనే బస్సును ఆపి మంటలు అదుపు చేశారు. ఈ ఘటన మదీన గూడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. డ్రైవర్ , స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు బీరంగూడ నుంచి కూకట్​పల్లి వైపు మధ్యాహ్నం 3 గం సమయంలో బయలు దేరింది.

ఈ క్రమంలో మదీనాగూడ జాతీయ రహదారి మియాపూర్ పొలీస్ స్టేషన్ కు వెళ్లే దారి వద్దకు చేరుకోగానే ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గుర్తించిన వాహనదారులు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో వెంటనే ఒకవైపు ఆపి మంటలను ఫైరింజన్ సాయంతో అదుపులోకి తీసుకు వచ్చారు. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా సదరు ట్రావెల్స్ బస్సు కూకట్ పల్లి లో ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి వెళ్లాల్సి ఉంది.


Next Story

Most Viewed