- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారి నిర్లక్ష్యం వల్లే నలుగురు మహిళలు మృతి: మహిళ కాంగ్రెస్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల సందర్భంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయని మహిళా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో జరిగిన కుటుంబ నియంత్రణ అపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృత్యువాత పడడం దారుణమన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపించారు.
బాధితులకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని ఆపరేషన్లు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మరణాలకు బాధ్యులైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుల్తాన్ బజార్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వారు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.