పర్యావరణ సంక్షోభం...అతిపెద్ద సవాలు : ప్రొఫెసర్ పురుషోత్తం

by Disha Web Desk 15 |
పర్యావరణ సంక్షోభం...అతిపెద్ద సవాలు : ప్రొఫెసర్ పురుషోత్తం
X

దిశ, సికింద్రాబాద్ : పర్యావరణ సంక్షోభం మానవ జాతి ముందున్న అతిపెద్ద సవాలు అని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ‘ఉన్నత విద్య మరియు సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ఓయూ దూరవిద్యా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సు ముగింపు సమావేశానికి ప్రముఖ పర్యావరణ వేత్త, ఓయూ రాజనీతి శాస్త్ర మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి హాజరై మాట్లాడారు.

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మానవ సమాజం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మానవుని ముందున్న ప్రథమ కర్తవ్యమని ఆయన సూచించారు. అనంతరం సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రు నాయక్ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు అనేక అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. 24 సాంకేతిక సెషన్లలో దేశ విదేశాలకు చెందిన పరిశోధకులు, ఆచార్యులు, మేధావులు 187 పరిశోధనా పత్రాలు సమర్పించారు.


Next Story