ముంపు సమస్యల పరిష్కారానికి కృషి : ప్రభుత్వ విప్ గాంధీ

by Disha Web Desk 15 |
ముంపు సమస్యల పరిష్కారానికి  కృషి : ప్రభుత్వ విప్ గాంధీ
X

దిశ, మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజక వర్గంలో లోతట్టు ప్రాంతాల ప్రజల ప్రధాన సమస్య అయిన వరద ముంపును శాశ్వతంగా పరిష్కరించడానే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీఐ కాలనీలో రూ. 30 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయన పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే వరదనీటి కి శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు.

వరద నీటి కాల్వ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రాపు గంగాధర్ రావు ,కిరణ్ యాదవ్ ,అన్వర్ షరీఫ్ , చంద్రిక ప్రసాద్ , రోజా , మహేందర్ ముదిరాజ్ , మహమ్మద్ ఖాజా, సుప్రజా, ఉమకిషన్ , ఎస్.శ్రీనివాస్ , స్వామి నాయక్ , సుధాకర్ , నాగరాజు యాదవ్ , నరేష్ , శివ ముదిరాజ్ , నరేష్ , జగదీష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed