- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ- మొబిలిటీ వీక్

దిశ, శేరిలింగంపల్లి : ఈనెల 11న నెక్లస్ రోడ్డులో జరగనున్న ఫార్ములా రేసింగ్ లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొబిలిటీ వీక్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని నెక్లస్ రోడ్డు, మియాపూర్ మెట్రో వద్ద నుండి మాదాపూర్ హైటెక్స్ వరకు ఎలక్ట్రిక్ వాహనాల ర్యాలీ సాగింది. నెక్లస్ రోడ్డు వద్ద హీరో అడవి శేషు ఎలక్ట్రిక్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించగా.. మియాపూర్ మెట్రో వద్ద మెట్రో అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సైకిల్స్, స్కూటర్లు, ఆటోలు, కార్లు భారీ ర్యాలీగా హైటెక్స్ వద్దకు చేరుకోగా అక్కడ ఈ ర్యాలీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున కొలువుదీరడం, ఫార్ములా రేసింగ్ లో పాల్గొనే మహీంద్ర కంపెనీ ఫార్ములా రేసింగ్ కారును ప్రదర్శనలో ఉంచడం అందరినీ ఆకర్షించింది. ఫార్ములా కారు వద్ద ఫొటోలు దిగేందుకు యువత పోటీపడ్డారు.