- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రేపటి నుండి చెరువుల్లో చేప పిల్లల పంపిణీ
దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గురువారం నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేపపిల్లలను వేసి మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమన్నారు.
చేప పిల్లల పంపిణీ వల్ల భవిష్యత్ లో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్య్సశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రులు, విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపీలు తదితర నేతలు చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి చెరువుకు మూడు రకాల చేప పిల్లలు ఇచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ తో పాటు, డైరెక్టర్ ప్రియాంక అలా తదితర అధికారులకు సూచించారు.