పరీక్ష కోసం వెళ్లిన మైనర్ విద్యార్థిని అదృశ్యం..

by Seetharam |
పరీక్ష కోసం వెళ్లిన మైనర్ విద్యార్థిని అదృశ్యం..
X

దిశ, సికింద్రాబాద్: పరీక్ష కోసం కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. అల్వాల్ ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్తె సాయి ప్రియాంక (16) నాగోల్‌లోని లాలన హోమ్‌లో ఉంటూ తార్నాకలోని విశ్వ చైతన్య కాలేజీలో ఒకేషనల్ కోర్స్ చదువుతుంది.

పరీక్ష కోసం వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి చేరుకోలేదు. హోం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు గర్ల్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మినారాయణ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సాయి ప్రియ గురించి ఆచూకీ తెలిసినవారు 8712660560, 8712660566 నంబర్స్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story