మృతదేహంతో రాత్రి 9 గంటల వరకు బంధువుల ధర్నా

by Dishanational1 |
మృతదేహంతో రాత్రి 9 గంటల వరకు బంధువుల ధర్నా
X

దిశ, ముషీరాబాద్: భర్త, అత్త వేధింపుల వల్ల ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువననగిరి జిల్లా అంతమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లై తొమ్మిది ఏళ్లు అవుతున్నా తన పిల్లలను దూరం చేసి భర్త సాగర్, అత్త నానా రకాలుగా వేధిస్తున్నారని శ్రీలత(33) అనే మహిళ తన పుటింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా శ్రీలత ఆత్మహత్య చేసుకోవడానికి భర్త సాగర్, అతని తల్లి వేధింపులే కారణమని శ్రీలత మృతదేహాన్ని హైదరాబాద్ రాంనగర్ బాగ్‌లింగంపల్లిలోని సంజయ్ నగర్ బస్తీలో మృతురాలి భర్త ఇంటి ముందు బంధువులు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు మృతురాలి భర్త ఇంటి ముందు బంధువులు మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి ఆందోళన చేపట్టారు. అయితే మృతురాలి భర్త సాగర్, అత్త పరారీలో ఉన్నారు. మృతురాలి 7 సంవ్సరాల అమ్మాయి, 5 సంవత్సరాల అబ్బాయిల పేరిట ఆస్తిని ఇచ్చి న్యాయం చేయాలని, అంత్యక్రియలు పిల్లలతో చేయించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. పిల్లలను తీసుకెళ్లేందుకు ఎట్టకేలకు మృతురాలి బంధువులకు ఇచ్చేందుకు పోలీసులు ఒప్పుకున్నారు. దీంతో ఆందోళనను విరమించారు.


Next Story

Most Viewed