అన్ని అనుమతులున్నా...కూల్చివేతకు అధికారుల ఆరాటం

by Disha Web Desk 15 |
అన్ని అనుమతులున్నా...కూల్చివేతకు అధికారుల ఆరాటం
X

దిశ, ఎల్బీనగర్ : హయత్ నగర్ మండల పరిధిలోని ఆటోనగర్ లో జాతీయ రహదారిపై అన్ని అనుమతులతో నిర్మించిన షెడ్డును కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నిఅనుమతులతో నిర్మించిన షెడ్డును ఎలా కూల్చివేస్తారంటూ మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆటోనగర్ సర్వేనెంబర్ 281 లో జీవరాజ్ పాటిల్ తన స్థలంలో గతంలోనే అన్ని అనుమతులతో షెడ్యూను నిర్మించుకున్నారు. కాగా ఇటీవల షెడ్డు మరమ్మతులు చేసుకుంటున్నారు.

ఈ షెడ్డు అక్రమం అంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు షెడ్డులోని బాత్రూం కూల్చేశారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం నవ జీవన్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్ని న్యాయబద్ధంగా ఉన్నా ఎలా కూల్చే స్తారంటూ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరుల కారులో కూల్చడానికి ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. న్యాయపరంగా అన్ని

డాక్యుమెంట్లు ఉండి లే ఔట్ ప్రకారం ఉన్న ప్లాట్ లో షెడ్డుకు మరమ్మతులు చేసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులపై ఒత్తిడి చేసి కూల్చివేయంచే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు సుష్మిత, ఉమా లకు కార్పొరేటర్లకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్ హోల్డర్లకు ఎలా వత్తాసు పలుకుతారంటూ ప్రశ్నించారు. కూల్చివేతల ప్రయత్నం ను కార్పొరేటర్లు తీవ్రంగా ప్రతిఘటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెను తిరిగారు.


Next Story

Most Viewed