- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రధానికి పోస్ట్ కార్డు పంపించిన డిప్యూటీ మేయర్
by S Gopi |

X
దిశ, సికింద్రాబాద్: చేనేతపై కేంద్రప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని నగర డిప్యూటీ మెయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టుకార్డు పంపించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వృత్తులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతూ ప్రధానికి ఉత్తరం పంపిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story