- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీ వలలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

దిశ, శేరిలింగంపల్లి : మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఈసారి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గదిలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 70 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడిని లంచం డబ్బులు తీసుకుని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని శ్రీనివాస్ వద్దకు వచ్చాడు. అతని వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.