- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన అభిషేక్ రావు సీబీఐ కస్టడీ

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో సీబీఐ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ నెల 10వ తేదీ నుంచి సీబీఐ కస్టడీలో ఉన్నారు. అభిషేక్ ను మొత్తం 5 రోజుల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో శనివారం ఆయనను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అభిషేక్ రావుకు రాష్ట్రంలోని పలువురు ప్రముఖ రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో తమకు సహకరించడం లేదని, తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని సీబీఐ అభిషేక్ రావును అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి సీబీఐ అధికారులు అభిషేక్ రావును విచారిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఆయనకు విధించిన కస్టడీ ఈ నెల 13తో ముగిసింది. అనంతరం మరో రెండు రోజుల కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించగా ఆ గడువు నేటితో ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై కు, అభిషేక్ రావుకు మధ్య జరిగిన లావాదేవీలపై కీలక సమాచారం రాబట్టింది. ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు దఫాలుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎల్ఎల్ సీ డైరెక్టర్ గా బోయినపల్లి అభిషేక్ రావు వ్యవహరిస్తున్నారు. అభిషేక్ రావు ఖాతాలోకి నగదు వచ్చిన విషయాన్ని సీబీఐ గుర్తించింది. పెద్ద మొత్తంలో జరిగిన ఈ ట్రాన్సాక్షన్ పై దర్యాప్తు సంస్థ ఫోకస్ పెట్టింది. దీని వెనుక ఉన్నది ఎవరూ అనేది కూపీ లాగే ప్రయత్నం చేసింది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ నుంచి అరెస్ట్ అయిన తొలి వ్యక్తి అభిషేక్ రావు కావడం గమనార్హం.