ఓయూలో దశాబ్ది ఉత్సవాలు బహిష్కరణ

by Disha Web Desk 15 |
ఓయూలో దశాబ్ది ఉత్సవాలు బహిష్కరణ
X

దిశ, సికింద్రాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని పలువురు విద్యార్ది జేఏసీ నాయకులు మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం పలు విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు ఉత్సవాలను బహిష్కరిస్తూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సంబురాలు ఎందుకు జరుపుతున్నారో ముఖ్యమంత్రి కేసీఅర్ సమాధానం చెప్పాలన్నారు.

ఉద్యోగాలు కల్పించలేని ముఖ్యమంత్రి సంబురాలు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర సాధనలో వందలాది మంది విద్యార్థి, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. అమరుల కుటుంబాల్లో ఒక్కటైనా సంతోషంగా లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. అమరుల త్యాగాలతో భోగాలు అనుభవిస్తున్న కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో విద్యార్థి జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజయ్, భీంరావ్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ తో పాటు పలువురు విద్యార్థులు ఉన్నారు.


Next Story

Most Viewed