హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు.. పరిష్కరానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం

by Dishafeatures2 |
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు.. పరిష్కరానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ దృశ్యాలే. ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజల తీవ్ర తంటాలు పడుతున్నారు. కాగా ట్రాఫిక్ జామ్ కు సంబంధించి ప్రయాణికులను అలెర్ట్ చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నం ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులను తమ సోషల్ మీడియా వేదికగా అలెర్ట్ చేస్తున్నారు. గంట గంటకు ట్రాఫిక్ అప్డేట్స్ అందిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉందో.. ఎక్కడ తక్కువ ఉందో తెలుసుకొని ప్రయాణికులు తమ గమ్య ప్రదేశానికి చేరుకోవడానికి పోలీసులు సాయం చేస్తున్నారు.

Next Story