కళాకారుల అభివృద్ధికి నిరంతరం కృషి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Disha Web Desk 15 |
కళాకారుల అభివృద్ధికి నిరంతరం కృషి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, అంబర్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలుగు కీర్తి పురస్కారాలు ప్రదానోత్సవం కార్యక్రమం ఫిలాంత్రోఫిక్ సొసైటీ, పుడమి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులు, సాహితీ వేత్తల సంక్షేమం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ యాస, భాష కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, గోరేటి వెంకన్న, సాయిచంద్ లాంటి వారికి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. దాదాపు 1200 మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అనంతరం సాహితీ రంగంలో విశిష్ట సేవలందించిన 20 మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరి శంకర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, చిలుముల బాల్ రెడ్డి, మాడ భూషి, కూన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు.Next Story