- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉస్మానియా యూనివర్సిటీలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన..

దిశ, సికింద్రాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్న పత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు మార్కులు కలిపి పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. డిమాండ్ చేస్తూ ఓయూలో కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో 22 తప్పుడు ప్రశ్నలు రావడం సిగ్గు చేటన్నారు. 22 మార్కులను తక్షణమే కలిపి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలిసు కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన పక్రియ-2ను నిలిపివేసి విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు చేసిన తప్పిదాలకు మేము ఉద్యోగాలకు దూరం కావాలా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎఐఎస్ఎఫ్ ఓయూ నేత, ఉదయ్ కుమార్, విద్యార్థులు ఒగోటి సైదులు, ఉపేందర్, శ్రీకాంత్, నవీన్, రాజు, నరేష్, సాయి, సమీర్, హఫీజ్, అఖిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.