ప్రగతి భవన్‌కు వీఆర్ఏలు...!

by S Gopi |
ప్రగతి భవన్‌కు వీఆర్ఏలు...!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు రెండున్నర నెలలుగా సమ్మె చేస్తున్నారు. తాజాగా మరో తొమ్మిది రోజులకు కార్యాచరణను ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్​లో వీఆర్ఏ జేఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా 8న మండల కేంద్రాల్లో రాస్తారోకో, 9న టెంట్ల కింద శాంతియుత నిరసన, 10న తహశీల్దార్ కార్యాలయాల దిగ్బంధం, 11న శాంతియుత నిరసన, 12న రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం, 13న టెంట్ల కింద శాంతియుత నిరసన, 14న బిక్షాటన(ఫండ్స్ మొబిలైజేషన్), 15న యాదాద్రి నుంచి ప్రగతి భవన్​కు పాదయాత్ర, 16న పాదయాత్ర కొనసాగింపు, 17న నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభం చేయనున్నట్లు జేఏసీ ప్రకటించింది. సమావేశంలో చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేష్ బహదూర్, సెక్రటరీ జనరల్ దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్లు ఎండీ రఫీ, వెంకటేశ్​యాదవ్, గోవిందు, వంగూరి రాములు, మాధవ్​నాయుడు, కంది శిరీష రెడ్డి, సునీత, ఎల్. నర్సింహారావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed