పండుగపూట శుభవార్త

by S Gopi |
పండుగపూట శుభవార్త
X

దిశ, సికింద్రాబాద్: మిట్ట స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో లాలాపేటలోని వైదేహి డాల్ఫిన్ స్కూల్ లో బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నడుస్తున్న కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలన్నారు. మిట్ట స్కిల్ అకాడమీ ద్వారా నిరుపేద విద్యార్ధులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర మున్నూరు కాపు కార్యవర్గ సభ్యులు, సికింద్రబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చేపూరి వెంకటేశ్వర్ రావు, మున్నూరు కాపు ఎన్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ ఆకుల శ్రీరజ్, సీనియర్ సిటిజన్ కన్వీనర్ బాధే పద్మారావు, తెలంగాణ రాష్ట్ర యువక మండలి అధ్యక్షుడు ఏనుగుల హరీష్, యువక మండలి ఉపాధ్యక్షుడు పత్తి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed