- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎనీమియాను నివారించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి: గవర్నర్

దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో రక్తహీనత వ్యాధి ( ఎనీమియా ) ను నివారించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు . దీనికోసం ప్రత్యేకించి పాఠశాల విద్యార్థులపై దృష్టి సారించాలని సూచించారు. ఎనీమియాను నివారించేందుకు సమగ్ర ప్రణాళిక రూపకల్పనే లక్ష్యంగా గవర్నర్ తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( ఎన్ఐఎన్ ) ను సోమవారం సందర్శించారు.
అందులో భాగంగా ఆమె అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, వారిని అలా వదిలేయకూడదని సూచించారు. ఎనీమియాను నివారించేందుకు శాస్త్రవేత్తలు తమ మేధస్సును వినియోగించాలని కోరారు . తృణధాన్యాల సంవత్సరంను ప్రస్తావిస్తూ అట్టడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె సూచించారు .