దేవరకద్ర ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by S Gopi |
దేవరకద్ర ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రొటోకాల్ విషయమై ప్రశ్నించిన నిర్వేన్ గ్రామ సర్పంచిపై జులుం ప్రదర్శించిన కొత్తకోట పోలీసులు, అందుకు కారణమైన దేవరకద్ర ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నిర్వేన్ గ్రామ సర్పంచ్ తో కలిసి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే మాత్రం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారన్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా ఎలా నిర్వహిస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని ప్రశ్నించిన సర్పంచ్ ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కొత్తకోట పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా అవమానించారని, అడ్డుకున్న కుటుంబ సభ్యులపై లాఠీ చార్జ్ చేశారని పేర్కొన్నారు. దీనిని కవరేజీ చేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను కూడా అవమానించి మీడియా స్వేచ్ఛను సైతం హరిస్తున్నారని అన్నారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులైన బాధ్యులైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి, ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలని వారు కమిషన్ ను కోరినట్లు పేర్కొన్నారు.

Next Story