ఏసీబీకి సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు... చర్యలు తప్పవా?

by S Gopi |
ఏసీబీకి సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు... చర్యలు తప్పవా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నందుకు, లంచం ఇవ్వజూపినందుకు అవినీతి నిరోధక చట్టం కింద సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని ఏఐసీసీ సభ్యుడు బక్కజడ్సన్ ఏసీబీ డైరెక్టర్‌ను కోరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురిచేసి టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో సీఎంపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బక్కజడ్సన్ మాట్లాడుతూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం‌తో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. ఇటీవల బీజేపీ నేతలు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభపెట్టినందుకు అవినీతి నిరోధక చట్టం-1988 కింద కేసు నమోదు చేసినట్టుగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కుడా అదే చట్టం కింద ఇంట్రాగేషన్ చెయ్యాలని ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కేకేసీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ నేత వేణు ముదిరాజ్, శాలివాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story