- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్ న్యూస్... టీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ సీరియస్

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులో మనమే గెలుస్తున్నామని.. అలాగని నిర్లక్ష్యం చేయవద్దని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. ప్రగతిభవన్ నుంచి బుధవారం మునుగోడు ప్రచారంలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డితోపాటు పార్టీ జిల్లా ఇన్ చార్జీ రవీందర్ రావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో టీఆర్ఎస్ కు సానుకూలత ఉందని, ప్రభుత్వ పథకాలపై మరింత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్న విషయం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ఫ్లోరైడ్ విముక్తికి తీసుకున్న చర్యలతో ప్రజలు, సంక్షేమ పథకాలతో ఆసరా పింఛన్ లబ్దిదారులంతా టీఆర్ఎస్ కు అండగా ఉన్నారన్నారు. అన్ని సర్వేలు సైతం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. కొంతమంది ఇంకా పనితీరును మెరుగు పర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. విజయం సాధిస్తామని, మెజార్టీ పెంపుపై దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. ఈ బైపోల్ కీలకమని అందరూ నిర్లక్ష్యం చేయకుండా కష్టించి పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కొంతమంది నేతలపై సైతం సీరియస్ అయినట్లు సమాచారం.