- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఉపాధి హామీ వర్కర్లకు గుడ్ న్యూస్.. రూ.300 కోట్లు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీరాజ్‌శాఖలో బిల్లుల క్లియరెన్స్మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ బిల్లుల విడుదల ప్రారంభమైంది. దశల వారిగా త్వరలోనే బిల్లులను చెల్లింపునకు చర్యలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా మొదటి దశలో రూ.446 కోట్లను గురువారం ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్ల ఉపాధి హామీ పనుల బిల్లులను విడుదల చేశారు. మిగిలిన రూ.146కోట్లను పారిశుద్ద్య వర్కర్ల వేతనాలకు కోసం చెల్లించారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లలకు మోక్షం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో పనిచేసే పారిశుద్ద్య కార్మికుల వేతనాలను చెల్లించడానికి రూ.146 కోట్లను విడుదల చేశారు. వీటి ద్వారా నవంబర్ నెలకు సంబంధించిన వేతనాలు పూర్తికానున్నాయి.త్వరలోనే డిసెంబర్‌కు సంబంధించిన వేతనాలకు సంబంధించిన మొత్తాన్ని కూడా విడుదల చేయనున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో పారిశుద్ద్య కార్మికుల వేతనాలన్ని ఈ కుబేర్ ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి వారి బ్యాంకు అకౌంట్లో జమ కానున్నాయి.
దీంతో గ్రామ పంచాయతీలకు కార్మికుల వేతనాల టెన్షన్ లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే 95వేల మంది ఉద్యోగుల వేతనాలను హైదరాబాద్ జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా రెండు నెల్లలో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ ను పూర్తిగా వాడుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం వారి ఇబ్బందులును అర్థం చేసుకుని బిల్లులు చెల్లించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.