- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిటీ కళాశాల గ్రంథాలయ శాఖ తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంతో ఒప్పందం

దిశ, చార్మినార్ : ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంతో ఎంఓయు ఐదు సంవత్సరాల పాటు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని ఉన్న జ్ఞాన సంపదను (ఐదు లక్షల పై చిలుకు) తాళప్రతా గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు, ఉర్దూ పర్షియన్ కన్నడ తమిళ భాషలలో ఉన్న గ్రంథాలు ప్రభుత్వ సిటీ కళాశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులకు ఉపయోగపడనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సిటీ కళాశాలలో గ్రంథాలయంలో 82,000 పుస్తకాలు, అపురూప పుస్తకాలను, పరిశోధన పుస్తకాలను రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ చదువురులు ఉపయోగించుకోవచ్చని సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాల భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ చేగోని, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం గ్రంథపాలకులు ఏవియన్ రాజు తదితరులు పాల్గొన్నారు.