- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యం వికటించి చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన
by Vinod kumar |

X
దిశ, ఖైరతాబాద్: వైద్యం వికటించి ఆరు సంవత్సరాల చిన్నారి మృతి చెందిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం జ్వరం, ఫిడ్స్‌తో ఉన్న ఆరు సంవత్సరాల చిన్నారిని లోటస్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే 3 లక్షల 60 వేల రూపాయల బిల్లు అవ్వగా.. తల్లిదండ్రులు మూడు లక్షలు కట్టారు. శనివారం రాత్రే వైద్యం వికటించి చిన్నారి చనిపోయింది. అయితే చనిపోయిన విషయం తమకు చెప్పలేదని.. యాజమాన్యం 60 వేలు కడితేనే డెడ్ బాడీని ఇస్తామన్నారని తల్లిదండ్రులు.. ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. లోటస్ ఆసుపత్రి పై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్తయ్య తెలిపారు.
Next Story