- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖైరతాబాద్ వినాయకునికి చీకోటి ప్రవీణ్ ప్రత్యేక పూజలు
by Nagaya |

X
దిశ, ఖైరతాబాద్ : ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్తానని చీకోటి ప్రవీణ్ అన్నారు. ఈడీ అధికారులు మళ్ళీ విచారణకు పిలవలేదని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా పూజలందుకుంటున్న బడ గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై వచ్చిన అపోహలన్ని పోవాలని ఖైరతాబాద్ వినాయకుడిని ప్రార్థించినట్లు చెప్పారు. త్వరలోనే తనపై వచ్చిన ఆరోపణలు అన్ని పోయి క్లీన్ చిట్‌తో బయటకు రావాలని వేడుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉందని, కోరిన కోరికలు తీరుతాయని భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story