Hyd: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజులు కురిసే ఛాన్స్

by srinivas |
Hyd: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజులు కురిసే ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదివారం, సోమవారం చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. సోమవారం నల్గొండ జిల్లా దామచర్లలో 37 .8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సూర్యాపేట , ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం, ములుగు పెద్దపల్లి జిల్లాలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయినట్లు వెల్లడించింది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ వేడి వాతావరణం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సాధారణంగా, ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా ఉదయం చినుకులు పడతాయని తెలిపింది.

‘రాబోయే నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం ఉంటుంది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రత 31 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది . తెలంగాణలోని 33 జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారం వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది.’ అని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో అక్టోబర్ 6-12 మధ్య నైరుతి రుతుపవనాలు వీడే అవకాశముందని అటు ఐఎండీ అంచనా వేసింది.



Next Story

Most Viewed