24న సమస్యల పరిష్కారానికి చలో విద్యుత్ సౌథ

by Disha Web Desk 15 |
24న సమస్యల పరిష్కారానికి చలో విద్యుత్ సౌథ
X

దిశ, ముషీరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో విద్యుత్ సౌథ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధనకై తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీన్ జేఏసీ సన్నాహక సమావేశం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్ లో శనివారం జరిగింది. జేఏసీ చైర్మన్ సాయిబాబా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు మాట్లాడుతూ విద్యుత్ కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం నష్టాల పేరుతో ఉద్యోగులకు పీఆరే ఇవ్వకుండా ఉండాలని చూస్తే సహించేది లేదన్నారు.

యాజమాన్యం ఏం చెబితే ఉద్యోగులు అవి మాత్రమే చేస్తున్నారని, అలాంటి సమయంలో విద్యుత్ సంస్థలో వచ్చే నష్టాలతో ఉద్యోగులకు, సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్టిజన్స్ కూడా వేతన సవరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ కో కన్వీనర్ బీసీ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకన్న గౌడ్, అనిల్, వజీర్, ఈశ్వరయ్య, నారాయణ నాయక్, గోవర్ధన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed