హైదరాబాద్‌లో కారు బీభత్సం... డ్రైవర్ ఇష్టమొచ్చినట్టు నడపడంతో...

by S Gopi |   ( Updated:2022-10-08 07:41:37.0  )
హైదరాబాద్‌లో కారు బీభత్సం... డ్రైవర్ ఇష్టమొచ్చినట్టు నడపడంతో...
X

దిశ, శేరిలింగంపల్లి: ఓ డ్రైవర్ అతివేగంతో కారు నడిపి బీభత్సం సృష్టించిన ఘటన మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున మాదాపూర్ మెట్రో పిల్లర్ 1726 దగ్గర అతివేగంతో దూసుకువచ్చిన కారు (టీఎస్ 11 ఈఎం 5858) అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపిన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story