- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొత్త రూట్లో గంజాయి గ్యాంగ్..

దిశ, వనస్థలిపురం : పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తుండగా... ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు నిఘా పెట్టి వారి ఆట కట్టిస్తున్నారు. నిఘా వ్యవస్థలకు సవాల్ విసురుతూ గంజాయి స్మగ్లర్లు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు కారులో వెళ్తున్నట్లు చిత్రీకరిస్తూ.. చేర్చాల్సిన చోటుకు సరుకును తరలిస్తున్నారు. శుక్రవారం ఇదే ప్లాన్‌తో కారులో కుటుంబ సభ్యులతో కలిసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను శుక్రవారం ఎక్సైజ్స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. హయత్నగర్ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో వివరాల ప్రకారం నిఘా వర్గాల అలర్ట్‌తో.. ఎక్సైజ్స్పెషల్టాస్క్ఫోర్స్సీఐ నాగరాజు టీమ్ పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. కారులో ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు ఒడిశా మల్కన్‌గిరి, జగ్జల్‌దేవ్‌పూర్ నుంచి వస్తున్న హైదరాబాద్‌లో శుభకార్యానికి వెళ్తున్నట్లు చెప్పారు.
కారును చెక్‌చేయగా.. గంజాయి బయట పడింది. కారు వెనుక సీటు కింది భాగంలో ప్రత్యేక అరలు చేసి 14 కేజీల గంజాయిని ప్యాకెట్లను అమర్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. గంజాయిని రవాణా చేసే లేడీ డాన్ సునీతా దాస్ గా గుర్తించారు. జగ్జల్‌దేవ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు తన కారులో గంజాయిని దూల్‌పేటలోని ఒక వ్యాపారికి ఇచ్చేందుకు వెళ్తున్నామని అంగీకరించారు. లేడీడాన్ సునీతా దాస్‌తో పాటు కారు డ్రైవర్ ఇస్తియా ఖురేషి, కంకన్ సన అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణకు వినియోగించిన కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 3.50 లక్షలు, కారు మరో రూ.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ఎస్సై జ్యోతితో పాటు సిబ్బంది ఉన్నారు. నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతి యాదవ్ అభినందించారు.