- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
హైదరాబాద్ నగరంలో పటాకులను పేల్చడం నిషేధం : సీపీ సీవీ ఆనంద్

దిశ, సిటీ క్రైమ్ : దేశంలో నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పటాకాలను కాల్చడాన్ని నిషేధించారు. ముఖ్యంగా కంటోన్మెంట్ తో పాటు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై ఈ పటాకులను కాల్చడాన్ని నిషేధిస్తూ సీపీ, డీజీ సీవీ ఆనంద్ శనివరాం అంక్షలను జారీ చేశారు. అకస్మాత్తుగా పటాకులను కాల్చినప్పుడు వచ్చే భారీ శబ్దాలతో తాజా పరిస్థితులతో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుందన్నారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో పాటు భద్రతను నిర్వహిస్తున్న పోలీసు అధికారుల మీద ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ప్రజలు, పౌరులు తాజా పరిస్థితులను అర్థం చేసుకొని పోలీసు లకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షలు ఈ రోజుల అమలులోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అంక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.