గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరైన బీఆర్ఎస్ నాయకుడు

by Sumithra |
గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరైన బీఆర్ఎస్ నాయకుడు
X

దిశ, శేరిలింగంపల్లి : హెచ్సీయూ వివాదంలో ఏఐ (ఆర్తీఫీషియల్ ఇంటలీజెన్స్ ) వాడి సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోస్ పోస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నె క్రిశాంక్ మంగళవారం మరోసారి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈనెల 9న ఆయనను సుమారు ఏడున్నర గంటల పాటు విచారించారు గచ్చిబౌలి పోలీసులు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మన్నె క్రిశాంక్ మరోసారి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. తన లాయర్లను వెంటబెట్టుకుని వచ్చిన ఆయనను పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Next Story

Most Viewed