చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం

by Disha Web Desk 15 |
చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
X

దిశ, శేరిలింగంపల్లి : చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అని ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి విధివిధానాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞ్యానేశ్వర్, కార్పొరేటర్లు, ఇతర బీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించుకుంటామని కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు ముక్త కంఠంతో నినదించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, గల్లీ గల్లీ, వాడ వాడలా తిరిగి ప్రచారం ముమ్మరం చేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈసారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తామని అన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కేసీఆర్ ను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం

చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడపకి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రవీందర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి , మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, రాజు నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, వాల హరీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed