Khairatabad: ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్

by Disha Web Desk 16 |
Khairatabad: ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్
X

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ నియోజవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపులో రెండో స్థానంలో చింతల రామచంద్రారెడ్డి కొనసాగుతుండగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి మూడు ప్లేస్‌లో ఉన్నారు. హోరా హోరీగా జరిగిన ఖైరతాబాద్ ఎన్నికల్లో తొలుత విజయారెడ్డి, ఆ తర్వాత చింతల రామచంద్రారెడ్డి ముందంజలో కొనసాగారు. అయితే 3,4,5,6 రౌండ్ వచ్చే సరికి అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ పుంజుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. రౌండ్, రౌండ్‌కు దానంకు ఓట్లు పెరుగుతున్నాయి. తొలి నుంచి కూడా దానం నాగేందర్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎన్నికల పోలింగ్ నుంచి పోల్ మేనేజ్‌మెంట్‌పై అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో అనూహ్యంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో గెలుపు ఆశలు వికసించాయి. దానం నాగేందర్ గెలుపు ఖాయమని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story