బ్రేకింగ్.. గౌలిగూడ కెమికల్ ఫ్యాక్టరీ‌లో బ్లాస్టింగ్..

by Mahesh |   ( Updated:2022-06-12 10:37:34.0  )
బ్రేకింగ్.. గౌలిగూడ కెమికల్ ఫ్యాక్టరీ‌లో బ్లాస్టింగ్..
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గౌలిగూడలో పేలుడు జరిగింది. కెమికల్ ట్రేడర్స్‌లో ఒక్కసారిగాపేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిగూడలో ఓ కెమికల్ ట్రేడర్స్ను ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి నడుపుతున్నారు. డబ్బాలో ఉన్న కెమికల్‌ను డ్రైనేజీ‌లో వేస్తుండగా ఒక్కసారిగ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొడుకు భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే తండ్రి వేణుగోపాల్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story