- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నడ్డాను కలిసిన బూర

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆయనతో పాటు కాషాయతీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సైతం మర్యాద పూర్వకంగా నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో బూర సత్కరించారు. ఆయన ఆశీస్సులు పొందారు. ఇదిలా ఉండగా నడ్డాను కలిసిన బండి సంజయ్ మునుగోడు బైపోల్ కు సంబంధించిన పలు అంశాలను ఆయనకు వివరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన నడ్డాకు వివరించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ వెళ్లిన నేతలంతా నేటి నుంచి ప్రచారంలో పాల్గొననున్నారు. నడ్డాను కలిసిన వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సైతం ఉన్నారు.
Next Story